Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడి, సాధించి, పరిపాలన వికేంద్రీకరణ, పాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలు ఏర్పాటు చేసిన నూతన ఒరవడిని సృష్టించారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
వనపర్తి : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) తెలంగాణ కోసం కొట్లాడి, సాధించి, పరిపాలన వికేంద్రీకరణ, పాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలు ఏర్పాటు చేసిన నూతన ఒరవడి ( New Trend ) ని సృష్టించారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy ) పేర్కొన్నారు. కొత్త జిల్లాల దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వనపర్తి పట్టణములో పాలిటెక్నిక్ కలశాల నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు, యువకులు, ప్రముఖులతో కలసి ఆదివారం 2కె రన్ నిర్వహించారు . అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి చిన్నారులతో పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు అవసరమైన కొత్త మండలాలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో ప్రథం స్థానంలో నిలిపారని కొనియాడారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా కొనసాగి కొత్త పుంతలు తొక్కిందని అన్నారు. కేసీఆర్ కృషి చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.వనపర్తి జిల్లా మరో 1000 ఏండ్లు వర్ధిల్లాలని భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయంగా నిలవాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ , 2కె రన్ కార్యక్రమంలో గణేష్ వాకింగ్ గ్రూప్ సభ్యులు ,బాలాజీ వాకింగ్ గ్రూప్ సభ్యులు, ఆర్టీసీ రిటైర్డ్ గ్రూప్ సభ్యులు, హనుమాన్ వాకింగ్ గ్రూప్ సభ్యులు, జై కిసాన్,జై జవాన్ సభ్యులు, కరాటే విద్యార్థులు, యువకులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

