CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
CJP protest : సీజేపీ నిరసనల వేళ ఢిల్లీలో పోలీసులు కఠినమైన ఆంక్షల్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు స్పందించింది.
CJP protest : సీజేపీ నిరసనల వేళ ఢిల్లీలో పోలీసులు కఠినమైన ఆంక్షల్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు స్పందించింది. బారికేడ్లు తొలగించాలని, ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని, మెట్రో రైళ్లు యథాతథంగా నడపాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు ఆదివారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో శనివారం పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. నిరసన జరిగే జంతర్ మంతర్‌తోపాటు అనేక చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీ పరిధిలోని 50కిపైగా మెట్రో రైలు స్టేషన్లను మూసేసి, రైలు సర్వీసుల్ని నిలిపివేశారు. ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేశారు. దీంతో ఢిల్లీలో ఒక నిర్బంధ, ఎమర్జెన్సీ వాతావరణం తలపిస్తోంది. దీంతో ఈ అంశంపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పందించింది.
జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదివారం అత్యవసరంగా విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో ప్రజా జీవితం సాధారణ స్థితికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని, మెట్రో రైళ్లు ప్రారంభించాలని, బారికేడ్లు తొలగించాలని సూచించింది. ప్రజలను అనవసరంగా, ప్రతి చోటా తనిఖీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. సీజేపీ నిరసన సందర్భంగా అత్యవసరమని భావిస్తే తప్ప ఈ ఆంక్షలు విధించకూడదని సూచించింది.
శాంతి భద్రతలకు నిజంగా విఘాతం కలుగుతుందని భావించినప్పుడే ఈ ఆంక్షలు అమలు చేయాలని వివరించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోం శాఖ సెక్రెటరీ, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ తీర్పు వెలువడటానికి ముందే సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే సహా కీలక నేతల్ని విడుదల చేయాలని మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

