Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Nepal Falsh Floods : నేపాల్‌లో వరదలు మరోసారి బీభత్సం సృష్టించాయి. రెండు నెలల క్రితం మిగిల్చిన విషాదం నుంచి తేరుకోకముందే తాజాగా అకస్మిక వరద ఉధృతికి చాలా ఇళ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి.
Nepal Falsh Floods : నేపాల్‌లో వరదలు మరోసారి బీభత్సం సృష్టించాయి. రెండు నెలల క్రితం మిగిల్చిన విషాదం నుంచి తేరుకోకముందే తాజాగా అకస్మిక వరద ఉధృతికి చాలా ఇళ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. గొర్ఖా జిల్లాలో బుధి గండకీ నది ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఊహించని విపత్తును అధికారులు గ్రహించేలోపే 35కు పైగా ఇళ్లు, పలు బ్రిడ్జిలు నేలమట్టమయ్యాయి. ఆదివారం సంభవించిన వరద తీవ్రతకు జలవిద్యుత్ కేంద్రం తీవ్రంగా
దెబ్బతిన్నది.
రెండు నెలల క్రితం ప్రకృతి ప్రకోపాన్ని చవిచూసిన నేపాల్‌ను మళ్లీ వరద భయపెట్టింది. ఆగస్టులో టిబెట్ సరిహద్దులో వరద విలయం 1,457 మందిని పొట్టనబెట్టుకోగా ఈసారి తాజా వరద తీవ్రత భారీగా ఆస్తి నష్టానికి కారణమైంది. గోర్ఖా జిల్లాలోని చుమ్నుబ్రి గ్రామంలో ఆదివారం బుదీ గండకీ నది ఉప్పొంగడంతో.. కొండల మధ్య నుంచి వేగంగా దూసుకొచ్చిన వరద ఉధృతికి పదుల సంఖ్యలో ఇళ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి.
ఆదివారం ఉదయం 3.66 మీటర్ల లెవల్ ఉన్న వరద తీవ్రత.. రెండు గంటల్లో 8.43 మీటర్లకు చేరింది. ప్రమాద సంకేతమైన ఐదు మీటర్లు దాటడంతో నష్టం భారీగా సంభవించింది. పెద్ద మొత్తంగా ఇసుక, బుదరలో కూడిన నీటి ప్రవాహం 34 ఇళ్లను, బ్రిడ్జిలను తుడిచిపెట్టేసిందని.. జలవిద్యుత్ కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నదని జాతీయ వివత్తు తగ్గింపు, నిర్వహణ సంస్థ (NDRRMA) వెల్లడించింది.
बुढीगण्डकीमा आएको बाढीबाट प्रभावित केही क्षेत्रको हेलिकोप्टरबाट लिइएका तस्विर https://t.co/gPNa0jWQ8t
— NDRRMA (@NDRRMA_Nepal) October 11, 2026
‘మాకు లభించిన ప్రాథమిక సమాచారం, శాటిలైట్ చిత్రాల ప్రకారం బుది గండకీ నది ప్రవాహానికి ఆటంకం ఏర్పడి.. ఒక్కసారిగా పెరిగిన నదీ ప్రవాహం తీవ్ర వరదకు దారి తీసి ఉంటుంది. సాంకేతిక కారణాలను విశ్లేషిస్తేనే తాజా వరదలకు కారణం తెలియనుంది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం సంభవించలేదు. లోతట్టు, తీర ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆదివారం సాయంత్రం వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరుతున్నాం’ అని ఎన్డీఆర్ఆర్ఎంఏ అధికారులు పేర్కొన్నారు. తాజా వరదల నేపథ్యంలో నేపాల్ ఆర్మీ సహాయక చర్యలు చేపడుతోంది. అత్యవసర వైద్య బృందాన్ని రాజధాని నుంచి హెలీక్యాప్టర్‌లో తరలించింది సైన్యం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

