PPF Benifits | మీరు రిస్క్‌లేని మార్గంలో మీ డబ్బు మదుపు చేయాలని కోరుకుంటున్నారా.. అయితే మీకోసం గొప్ప ఆప్షన్ ఉంది. అటువంటి ఇన్వెస్టర్ల కోసం పోస్టాఫీసులో ప్రిఫరబుల్ ఆప్షన్ ఉంది. మీ మదుపుపై మీకు మంచి రిటర్న్స్ అందించాలన్నదే ప్రభుత్వ యోచన. ఇందుకు పోస్టాఫీస్ సేవింగ్స్ ప్లాన్ ప్రకారం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత భారీమొత్తంలో రిటర్న్స్ లభిస్తాయి. ఒక ఏడాది నుంచి 15 ఏండ్ల గడువు వరకు మెచ్యూరిటీ గడువు ఉంటుంది. ఉదాహరణకు మీరు దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ వ్యూహంతో ఉన్నారా.. అయితే మీరు పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్)లో మదుపు చేయండి.
పోస్టాఫీసు సేవింగ్స్ పథకాలపై వార్షిక ప్రాతిపదికన 7.1 శాతం వడ్డీరేటు అమలవుతుంది. పీపీఎఫ్ స్కీమ్ 15 ఏండ్ల వరకు.. అటుపై మరో ఐదేండ్ల వరకు కొనసాగించొచ్చు. దీనిపై మీరు గొప్ప బెనిఫిట్స్ పొందొచ్చు. ఏటా గరిష్ఠంగా రూ.1.50 లక్షలు మదుపు చేయవచ్చు. దీన్ని ఏడాదికోసారి ఇన్వెస్ట్ చేయడం కంటే నెలకోసారి రూ.12,500 చెల్లించాలి. దీనికి ఆదాయం పన్ను చట్టం (ఐటీ యాక్ట్)లోని 80సీ సెక్షన్ కింద పన్నుమినహాయింపు లభిస్తుంది. మీరు 15 ఏండ్లలో రూ.22.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. మీకు రూ.18 లక్షల వడ్డీ లభిస్తుంది.
ఈ పథకం వివరాలేంటో చూద్దాం..
మెచ్యూరిటీ:15 ఏండ్లు
నెలవారీ ప్రీమియం : రూ.12,500
ఏడాది ఇన్వెస్ట్మెంట్: రూ.1.50 లక్షలు
15 ఏండ్లలో మొత్తం మదుపు: రూ.22.50 లక్షలు
వార్షిక వడ్డీరేటు :7.1 శాతం
మెచ్యూరిటీ మొత్తం: రూ.40.70 లక్షలు
వడ్డీ బెనిఫిట్: రూ.18.20 లక్షలు
ఒకవేళ మీరు 25 ఏండ్లు డిపాజిట్ చేస్తే..
నెలవారీ మదుపు : రూ.25 లక్షలు
ఏడాది మొత్తం పెట్టుబడి : రూ.1.50 లక్షలు
25 ఏండ్లలో మదుపు : రూ.37.50 లక్షలు
వార్షిక వడ్డీరేటు: 7.1 శాతం
మెచ్యూరిటీ మొత్తం : రూ.1.03 కోట్లు
వడ్డీ బెనిఫిట్ : రూ.62.50 లక్షలు