Suriya 47 | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య. ఇప్పటికే ఆర్జే బాలాజీ డైరెక్షన్లో నటిస్తున్న కరుప్పు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు సూర్య 47 ప్రాజెక్ట్ కూడా ట్రాక్‌పైనే ఉంది. జీతూ మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఆవేశం చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జీతూ మాధవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది.
ఇదిలా ఉంటే ఈ మూవీలో స్టార్ కపుల్ సందడి చేయబోతున్నారన్న అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. ఇంతకీ వారెవరెనే కదా మీ డౌటు. మలయాళ స్టార్ కపుల్ ఫహద్ ఫాసిల్, నజ్రియా నజీమ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారట. తాజా టాక్ ప్రకారం ఫహద్ ఫాసిల్ ఇందులో విలన్‌గా కనిపించనుండగా.. నజ్రియా నజీమ్ కీ రోల్లో నటిస్తున్నట్టు ఓ వార్త ఇప్పుడు సినిమాపై అంచనాల పెంచేస్తుంది. ఈ చిత్రంలో సూర్య పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలిసిందే.
సూర్య కొత్తగా లాంచ్ చేసిన ప్రొడక్షన్ హౌస్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫహద్ ఫాసిల్ హీరోగా జీతూ మాధవన్ తెరకెక్కించిన ఆవేశం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. మరి జీతూ మాధవన్ సూర్యతో సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.