Mahesh Babu | మహేశ్ బాబుతో రాజమౌళి మైథికల్ అడ్వెంచర్ ..“SSMB29” టైటిల్, గ్లింప్స్‌కి గ్లోబల్ ఈవెంట్!
Mahesh Babu | ప్రపంచ సినీ వేదికపై తెలుగు సినిమాకి కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ‘బాహుబలి’ సిరీస్‌తో భారత సినిమాను గ్లోబల్ మ్యాప్‌పై నిలబెట్టారు.‘ఆర్ఆర్ఆర్’తో ఆస్కార్ దక్కేలా చేశారు.
Mahesh Babu | ప్రపంచ సినీ వేదికపై తెలుగు సినిమాకి కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ‘బాహుబలి’ సిరీస్‌తో భారత సినిమాను గ్లోబల్ మ్యాప్‌పై నిలబెట్టారు.‘ఆర్ఆర్ఆర్’తో ఆస్కార్ దక్కేలా చేశారు. ఇక ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో కలిసి మరొక భారీ ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు. “SSMB29” గా పిలుస్తున్న ఈ సినిమా భారత సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కనుందని ఇండస్ట్రీ టాక్.దుర్గా ఆర్ట్స్ పతాకంపై ఎస్.గోపాల్‌రెడ్డి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లు, యాక్షన్ స్టంట్ మాస్టర్స్, మరియు టాప్–నాచ్ VFX ఆర్టిస్టులు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారు.
రాజమౌళి గ్లోబల్ మార్కెట్‌పై దృష్టి సారించి, హాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థలతో టైఅప్‌లను కూడా ఫైనలైజ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రపంచ ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్తోనూ చర్చలు కొనసాగుతున్నాయట. అడ్వెంచర్ యాక్షన్ డ్రామా జానర్లో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు ఓ “గ్లోబల్ ఎక్స్‌ప్లోరర్” పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ సూపర్‌స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ మరియు నటుడు మాధవన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఆఫ్రికా అడవులు, దక్షిణ అమెరికా అమెజాన్ బేసిన్, ఐస్లాండ్ వంటి విభిన్న లొకేషన్లలో చిత్రీకరణ జరగగా, యూనిట్ ప్రస్తుతం తదుపరి షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది.
ఇక ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ అప్డేట్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం, నవంబర్ 16న రాజమౌళి “SSMB29” టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయాలని నిర్ణయించారట. ఈ అప్డేట్ను హాలీవుడ్ స్థాయిలో ప్లాన్ చేసిన ఓ గ్రాండ్ ఈవెంట్లో విడుదల చేయనున్నారు. అందులోనూ మరో సెన్సేషన్ ఏమిటంటే ఆ ఈవెంట్‌కి “అవతార్” దర్శకుడు జేమ్స్ కామెరూన్ హాజరయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. “Avatar: Fire and Ash” ప్రమోషన్ కోసం ఇండియాకు రానున్న కామెరూన్తోనే గ్లోబల్ లెవల్లో ఈ అప్డేట్ విడుదల చేయించాలనే రాజమౌళి ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఈ గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా హైప్‌కి కొత్త మైలురాయి అవుతుంది అంటున్నారు. మొత్తం మీద, “SSMB29”తో మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ మరోసారి ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్‌కి తీసుకెళ్లనుందనే నమ్మకం పెరిగింది
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

