పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan). మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. కాగా పొన్నియన్ సెల్వన్-1 (Ponniyin Selvan-1) సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది. భారీ మల్టీస్టారర్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పటికే హైదరాబాద్‌లో జరిగింది.
కాగా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్ డేట్ బయటకు వచ్చింది. పొన్నియన్ సెల్వన్-1కు హైదరాబాద్‌లోని ప్రధాన మల్టీప్లెక్స్‌లలో అత్యధిక టికెట్స్ ధర రూ.295 ఉండబోతుందని తాజా టాక్. ప్రభుత్వం అనుమతుల మేరకు ఈ ధర ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ మధ్యకాలంలో చాలా తెలుగు సినిమాలు ఎక్కువ టికెట్ల ధరలు పెట్టలేదు. కానీ ఇపుడు పొన్నియన్ సెల్వన్ ఇపుడు అధిక ధరలతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది.
ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, శరత్‌కుమార్, జయరామ్, విక్రమ్ ప్రభు, కార్తీ, జయం రవి, పార్థీబన్, ప్రకాశ్ రాజ్, అరవింద్ స్వామి, శోభితా ధూళిపాళ, ఐశ్వర్యా రాయ్, త్రిష, కీ రోల్స్ చేస్తున్నారు.
చోళుల కాలం నాటి కథ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో కార్తీ వల్లవరాయన్ వండియదేవన్ పాత్రలో నటిస్తున్నాడు. విక్రమ్ అధిత కరికానల్ పాత్ర పోషిస్తున్నాడు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.