Polytechnic Students | పాలిటెక్నిక్ విద్యను కనుమరుగు చేసేందుకు, విద్యార్థుల భవిష్యత్‌ను ఆగం చేసేందుకు రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన GO 97పై ఆందోళన కొనసాగుతోంది. పాలిటెక్నిక్ విద్యార్థులు GO 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎక్కిడకక్కడ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. కాలేజీలకు వెళ్లకుండా రోడ్ల మీదికొచ్చి తమ భవిష్యత్‌ను ఆగం చేయొద్దని వేడుకుంటున్నారు.
రాయదుర్గం వద్ద నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. విద్యార్థులను అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్లారు. దీంతో విద్యార్థులు ఇదేం రాజ్యం ఇదేం రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ నినాదాలు చేశారు. అమ్మాయిల మీద ఎట్లా చేయి వేస్తర్ సార్.. ఎట్లా కొడతరు అంటూ విద్యార్థులు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ పాలనలో విద్యార్థుల పట్ల ఖాకీల దౌర్జన్యం ఎలా ఉందో ఈ వీడియోలు చూడండి.
GO 97 రద్దు చేయాలని రాయదుర్గం వద్ద నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు pic.twitter.com/XsnUhxPG4a
— Telugu Scribe (@TeluguScribe) September 9, 2026
రాయదుర్గం వద్ద నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులను అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్తున్న పోలీసులు https://t.co/LuImOIuxTt pic.twitter.com/YoVYmMsb28
— Telugu Scribe (@TeluguScribe) September 9, 2026
Asian Games | జపాన్‌లో భారీ వరదలు.. ఆసియా గేమ్స్‌కు ముప్పు.. అథ్లెట్స్ తరలింపు
AP News | రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం లాంటివి : వైఎస్ జగన్
భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి : జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి