వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, పోలీసులు అత్యుత్సాహం చూపించారు. బీఆర్ఎస్ ప్రచార రథాన్ని అడ్డుకుని డ్రైవర్ను వేధింపులకు గురిచేశారు. కాంగ్రెస్ ప్రచారమయ్యేంత వరకు బీఆర్ఎస్ ప్రచార రథం తిరగకూడదని పోలీసులు హుకుం జారీ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నియోజకవర్గమైన వర్దన్నపేటలోని పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏనుగల్లు గ్రామంలో తిరుగుతున్న బీఆర్ఎస్ ప్రచార రథాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ప్రచార రథాన్ని అడ్డుకుని డ్రైవర్ను వేధింపులకు గురిచేశారు. గ్రామంలో కాంగ్రెస్ ప్రచారం అయిపోయేవరకు బీఆర్ఎస్ ప్రచార రథం తిరగకూడదని పోలీసులు హుకుం జారీ చేశారు. ఇదిలా ఉంటే.. పర్వతగిరి మండలం మాల్యా తండాలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ వ్యవసాయ మార్కెట్లో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. అయినప్పటికీ ఎన్నికల అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకుల, పోలీసుల అత్యుత్సాహం
కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నియోజకవర్గం వర్ధన్నపేటలోని పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో బీఆర్ఎస్ ప్రచార రథాన్ని అడ్డుకొని డ్రైవర్ను వేధింపులకు గురి చేసిన పోలీసులు
గ్రామంలో కాంగ్రెస్ ప్రచారం అయిపోయే… pic.twitter.com/iwyYMEwT5z
— Telugu Scribe (@TeluguScribe) December 7, 2025