భద్రాద్రి కొత్తగూడెం : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులపై ఉక్కుపాదం మోపుతున్నది. ప్రజాస్వామ్యయుతంగా చేపట్టే నిరసనలను కూడా పోలీసులతో అడ్డుకుంటున్నది. తాజాగా సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన చలో పూసుగూడెం కార్యక్రమాన్ని పాల్వంచలో పోలేసులు అడ్డుకున్నారు.
జిల్లా నుంచి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, దిందిగాలా రాజేందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్‌కు నిరసనగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.