పాపన్నపేట , సెప్టెంబర్ 29 : పోగొట్టుకున్న ఫోన్లో రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో పాపన్నపేట పోలీసులు మెదక్ జిల్లాలో ప్రథమ స్థానం నిలిచారు. వివరాల్లోకెళ్తే గత కొంతకాలంగా వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న ఫోన్ల బాధితులు మీసేవ ద్వారా కంప్లైంట్ చేశారు. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 601 ఫోన్లను పోలీసులు గుర్తించగా అందులో 589 సెల్ ఫోన్లు ( 98 శాతం) రికవరీ చేసి బాధితులకు అందజేశారు.
మంగళవారం సైతం మరో 12 ఫోన్లు రికవరీ చేసి పోగొట్టుకున్న బాధితులకు ఫోన్లను అప్పగించారు. ఈ 12 ఫోన్ల విలువ రూ.2,4500 విలువ ఉంటుంది. పోగొట్టుకున్న ఫోన్లను అతి త్వరలోనే గుర్తించి రికవరీ చేసి బాధితులకు అందజేయడంలో పాపన్నపేట పోలీసులు జిల్లాలోని ప్రథమ స్థానంలో నిలిచారు. గతంలో సైతం పెద్ద ఎత్తున ఫోన్లు రికవరీ చేసి డిఎస్పి చేతుల మీదుగా అందజేశారు. పోయిన ఫోన్లను రికవరీ చేసి అందజేయడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.