అర్వపల్లి, ఫిబ్రవరి 24/హైదరాబాద్, (నమస్తే తెలంగాణ) : సోషల్ మీడియాలో వీడియో క్లిప్పులు షేర్ చేసినందుకు బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఫోన్‌చేయడంతో వదిలిపెట్టారు. సీఎం అన్న కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసినందుకు సూర్యాపేట జిల్లా కాసర్లపహాడ్‌కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మెండే సురేశ్యాదవ్ను మంగళవారం పోలీసులు మఫ్టీలో వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
డీఎస్పీ కార్యాలయంలో కౌ న్సెలింగ్ ఇచ్చారు. అతడి ఫోన్లను లాక్కున్నారు. మందలించి వదిలేశారు. ఆ తరువా త అర్వపల్లి పోలీస్ స్టేషన్లో ఉంచారు. గతంలో సురేశ్ సోషల్ మీడియాలో అనవసర పోస్టులను షేర్ చేశాడని ఎస్సై సైదులు వివరణ ఇచ్చారు. సురేశ్యాదవ్పై పోలీసుల తీరు దారుణమని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తప్పుపట్టారు. వెంటనే విడుదల చేయాలని ఆయన ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.