హైదరాబాద్ : వందేండ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో గోదావరికి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి.. 9 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నానికి 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరిలో గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది. వరద ఉధృతి కారణంగా పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం 32.2 మీటర్లకు చేరుకుంది. గంటకు 35 సెం.మీ. చొప్పున గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.