PM Modi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీహార్(Bihar)లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర (Voter Adhikar Yatra)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఆయన తల్లిపై (Modi mother) కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై ప్రధాని తాజాగా స్పందించారు. ఇటీవలే బీహార్‌లో నిర్వహించిన సమావేశాల్లో విపక్షాలు చనిపోయిన తన తల్లిని లక్ష్యంగా చేసుకున్నాయని మండిపడ్డారు. తన తల్లిని అవమానిస్తూ మాట్లాడారని, ఆమెకు అవమానం జరిగిందన్నారు. ఈ మేరకు ఆర్జేడీ- కాంగ్రెస్ (RJD-Congress)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
‘అమ్మే మన ప్రపంచం. అమ్మే మన ఆత్మగౌరవం. బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ నిర్వహించిన సమావేశాల్లో విపక్షాలు చనిపోయిన నా తల్లిని లక్ష్యంగా చేసుకున్నారు. మా అమ్మను అవమానిస్తూ మాట్లాడారు. ఇది నా తల్లికి జరిగిన అవమానం మాత్రమే కాదు. దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు జరిగిన అవమానం. వారి మాటలు నన్ను ఎంతో బాధించాయి. బీహార్ ప్రజలు కూడా అదే బాధలో ఉన్నారని నాకు తెలుసు. నా తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. అయినా ఎందుకు ఇందులోకి లాగారు..?’ అంటూ మోదీ ఫైర్ అయ్యారు.
Also Read..
Tesla | భారత విపణిలో టెస్లాకు నిరాశే.. ఆశించిన స్థాయిలో లేని బుకింగ్స్..!
Uttarakhand | ఉత్తరాఖండ్‌కు రెడ్ అలర్ట్.. 10 జిల్లాల్లో పాఠశాలలు మూసివేత