బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని మోదీ (PM Modi) భేటీ అయ్యారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా తియాన్జిన్ చేరుకున్న మోదీ.. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. దీనికి ముందే అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కాగా, 2018 తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి.
Prime Minister Narendra Modi holds a bilateral meeting with Chinese President Xi Jinping in Tianjin, China.
(Source: ANI/DD News) pic.twitter.com/jrjh4TrfUN
— ANI (@ANI) August 31, 2025
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘రెండు దేశాల సంబంధాలు పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. గతేడాది కాజాన్లో జరిగిన సుహృద్భావ వాతావరణంలో జరిగిన జరిగిన చర్చల తర్వాత భారత్-చైనా సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకొన్నది. ఇటీవలే కైలాస మానససరోవర్ యాత్ర పునఃప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నాం. భారత్-చైనా సత్సంబంధాలు 2.8 బిలియన్ల ప్రజలకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. ఎస్సీవోకు విజయవంతంగా నేతృత్వం వహిస్తున్నందుకు చైనాను అభినందిస్తున్నా. తనను ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు, ఈ సమావేశం జరుపుతున్నందుకు ధన్యవాదాలు’ అని అన్నారు.
#WATCH | Tianjin, China: During his bilateral meeting with Chinese President Xi Jinping, Prime Minister Narendra Modi says, “Last year in Kazan, we had very fruitful discussions which gave a positive direction to our relations. After the disengagement on the border, an atmosphere… pic.twitter.com/IT9leLWI3j
— ANI (@ANI) August 31, 2025
భారత్, చైనా, రష్యా సహా 26 దేశాల అగ్రనేతలు పాల్గొనే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు తియాన్జిన్ నగరంలో జరుగనుంది. ఆది, సోమవారాల్లో జరుగనున్న ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు హాజరవుతున్నారు. ఇటీవల ట్రంప్ వివిధ దేశాలపై విధించిన సుంకాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అశాంతి నేపథ్యంలో ఈ ఎస్సీవో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సుంకాల బాధకు గురైన పలు దేశాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సుంకాలతో బెదిరిస్తున్న అమెరికాకు ఈ సమావేశం ఎలాంటి సందేశం, హెచ్చరిక ఇస్తుందన్న అంశంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#WATCH | Tianjin, China: During his bilateral meeting with Chinese President Xi Jinping, Prime Minister Narendra Modi says, “An agreement has been reached between our Special Representatives regarding border management. Kailash Mansarovar Yatra has been resumed. Direct flights… pic.twitter.com/ctxwPLlWXr
— ANI (@ANI) August 31, 2025
#WATCH | Tianjin, China: During his bilateral meeting with Chinese President Xi Jinping, Prime Minister Narendra Modi says, “I congratulate you on China’s successful chairmanship of the SCO. I thank you for the invitation to visit China and for our meeting today.”
(Source:… pic.twitter.com/KGFc8Curi6
— ANI (@ANI) August 31, 2025