PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) ;హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రచారం ముగియడంతో కన్యాకుమారిలో ప్రధాని మోదీ 45 గంటలపాటు ఏకాంత ధ్యానముద్రలోకి వెళ్లిపోయారు. అయితే, ఇదే సమయంలో దేశంలో ఏమైనా అత్యయిక పరిస్థితులు ఏర్పడితే ఇన్చార్జి ఎవరన్న ప్రశ్నకు.. ప్రధాని ధ్యానముద్రలో మాత్రమే ఉన్నారని, అవసరమైతే, ఆయన్ని సంప్రదించే అవకాశమున్నదని ఓ మాజీ క్యాబినెట్ కార్యదర్శి పేర్కొనగా.. ఇంచార్జీని నియమించకుండానే ప్రధాని వెళ్లడం సరైన చర్యకాదని మరో ఉన్నతాధికారి అన్నారు