కొల్లాపూర్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ( Pink flag ) ఎగురాలని బీఆర్ఎస్(BRS) రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘు వర్ధన్ రెడ్డి (Raghuvardhan Reddy) కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం కొల్లాపూర్, కోడేరులో మండల పరిధిలో నాగులపల్లి తండా గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతామన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఎత్తo సురేష్ రెడ్డి ,పార్టీ మండల అధ్యక్షుడు సూర్య రాజా శేఖర్ గౌడ్, గ్రామ అధ్యక్షులు కుమార్ , మాజీ ఎంపీటీసీ బాలు నాయక్ , బాలు నాయక్ , నాయకులు రాములు నాయక్ , భాషా నాయక్ , రఘునాథ్ ,స్వామి నాయక్ , శoకర్, జినబాలు, రాజు,తులసి రామ్, పాప్ప రాయుడు, జగపతి చెందర్, గోపి యాపచెట్టు లాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.