హైదరాబాద్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్ర భాకర్‌రావు కస్టడీని సుప్రీంకోర్టు ఈ నెల 25 వరకు పొడిగించింది. జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఎదుట శుక్రవారం జరిగిన వాదనల సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కస్టడీని పొడిగించాలని కోరారు.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ కస్టడీలో ప్రభాకర్‌రావు సహకరించడం లేదని, మరికొన్ని రోజులు విచారించా ల్సి ఉందని చెప్పారు. మరోవారం రోజులు విచారణకు అనుమతి ఇవ్వాలని కోరగా ధర్మాసనం అంగీకరించింది. ఈ నెల 26న ఆయనను రిలీజ్ చేయాలని ఆదేశిస్తూ కేసును జనవరి 16కు వాయిదా వేసింది.