తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప దేవాలయంలోని బంగారం దోపిడీ కేసులో మనీ లాండరింగ్‌పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు ఈడీకి కొల్లం విజిలెన్స్ కోర్టు అనుమతి ఇచ్చింది. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది.
ఈ కేసుకు సంబంధించిన అన్ని కీలక పత్రాలను, రెండు ప్రైమరీ ఎఫ్ఐఆర్లు, సాక్షుల వాంగ్మూలాలను ఈడీకి అప్పగించాలని సిట్‌ను ఆదేశించింది. ఆలయంలో కట్టుదిట్టమైన భద్రత ఉండే స్ట్రాంగ్‌రూమ్, గర్భ గుడిలలోని బంగారం, వెండి దొంగతనానికి గురైన సంగతి తెలిసిందే.