హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని అట్లాంటాలో ఏర్పాటు చేయనున్న దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని వచ్చేఏడాది ఏప్రిల్ నెలాఖరున ఆవిష్కరించనున్నట్టు పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల వెల్లడించారు. ప్రస్తుత కరోనా పరిస్థితులవల్ల వాయిదా వేసినట్టు తెలిపారు. సో మవారం అట్లాంటాలో జరిగిన సమావేశం లో మాట్లాడుతూ విగ్రహస్థాపనకు మూడు స్థలాలను పరిశీలించామని, వచ్చేవారం ఇం డియా నుంచి విగ్రహాన్ని పంపేందుకు ఏర్పా ట్లు జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమానికి తెలంగాణ నుంచి ప్రముఖులను, పీవీ, మార్టిన్ లూథర్‌కింగ్ కుటుంబ సభ్యులను పిలుస్తున్నట్టు తెలిపారు. ఐఏసీఏ ఫౌండింగ్ మెంబర్ డాక్టర్ పాడిశర్మ ఆధ్వర్యంలో జరిగి న సమావేశంలో కిషన్ తాళ్లపల్లి, వెంకట్ మీసాల, శ్రీధర్ కొంకల పాల్గొన్నారు.