Riyan Parag : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) కొత్త కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్నకు తెరపడింది. సుదీర్ఘ కాలం జట్టుతో కొనసాగుతున్న రియాన్ పరాగ్(Riyan Parag)కే పగ్గాలు అప్పగించింది యాజమాన్యం. దాంతో, పంతొమ్మిదో సీజన్ వేలానికి ముందు ట్రేడ్ పద్ధతిలో సొంత గూటికి చేరిన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఐపీఎల్ కెప్టెన్సీ కల చెదిరింది. నిరుడు సంజూ శాంసన్ గైర్హాజరీలో గులాబీ టీమ్‌ను నడిపించిన అతడికే యాజమాన్యం జై కొట్టిందని సమాచారం. ఈ విషయాన్ని శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది రాజస్థాన్ ఫ్రాంచైజీ.
పద్దెనిమిదో సీజన్ అనంతరం రాజస్థాన్ జట్టుకు సంజూ శాంసన్(Sanju Samson) గుడ్ బై చెప్పడంతో తదుపరి సారథి? అనే చర్చ మొదలైంది. ట్రేడ్ పద్ధతిలో జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ ఇస్తారని.. రియాన్ పరాగ్, యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్ కూడా రేసులో ఉన్నారని కథనాలు వచ్చాయి. కానీ, చివరకు జడ్డూను కూడా కాదని పరాగ్ నయా సారథిగా ఎంపికయ్యాడు. పంతొమ్మిదో సీజన్లో అతడి నాయకత్వంలోనే రాజస్థాన్ ఆడనుంది.
Royals fam, it’s time to get behind your new Captain! 💪💗 pic.twitter.com/OjodsT0fu5
— Rajasthan Royals (@rajasthanroyals) February 13, 2026
🚨 MEET THE NEW CAPTAIN OF RAJASTHAN ROYALS 🚨
– Riyan Parag has been named the new captain of Rajasthan Royals 🩷
2026 = Riyan Parag
2021-25 = Sanju Samson
2019-20 = Smith
2018-19 = Ajinkya
2014-15 = Smith
2012-13 = Rahul Dravid
2008-11 = Shane Warne pic.twitter.com/K0UXmxmPB1— Richard Kettleborough (@RichKettle07) February 13, 2026
ఇప్పటివరకూ రాజస్థాన్‌కు ఐదుగురు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆరంభ సీజన్లో దివంగత షేన్ వార్న్ కెప్టెన్సీలో ఆడిన రాజస్థాన్ ట్రోఫీని కొల్లగొట్టింది. 2012, 13వ సీజన్లో రాహుల్ ద్రవిడ్. 2014-15లో స్టీవ్ స్మిత్ సారథిగా సేవలందించారు. 2018-19లో అజింక్య రహానే.. అనంతరం మళ్లీ 2019-20 సీజన్లలో స్మిత్ పగ్గాలు స్వీకరించారు. 2021లో రాజస్థాన్ సారథిగా సంజూ శాంసన్ ఎంపికయ్యాడు. శాంసన్ నాయకత్వంలో దుమ్మురేపిన రాజస్థాన్ ఫైనల్ ఆడింది.
India all rounder Riyan Parag is set to be announced as the new captain of Rajasthan Royals ahead of IPL 2026. According to reports, the franchise considered options including Yashasvi Jaiswal, Dhruv Jurel, and veteran Ravindra Jadeja, but ultimately chose Parag, who has been… pic.twitter.com/0SwoVkALJR
— Northeast Now (@NENowNews) February 13, 2026
అయితే.. గత రెండు సీజన్లలో ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. పద్దెనిమిదో సీజన్లో సంజూ గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమవ్వగా.. రియాన్ పరాగ్ జట్టును అద్భుతంగా నడిపించాడు. పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా రికార్డు సెంచరీతో మెరవడం.. కెప్టెన్‌గా పరాగ్ రాణించడం శాంసన్‌కు ప్రతిబంధకంగా మారాయి. కొత్త జట్టుకు ఆడడమే మంచిదని భావించిన అతడు.. పంతొమ్మిదో సీజన్ వేలానికి ముందే ట్రేడ్ పద్ధతిన చెన్నైకి వెళ్లాడు. బదులుగా రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను తీసుకుంది రాజస్థాన్.
#OnThisDay in 2008 – The Royals created history with the highest @IPL chase ever. 😍
Any guesses on who broke this record last year? 😌#HallaBol pic.twitter.com/z2CmsnFe42
— Rajasthan Royals (@rajasthanroyals) April 24, 2021