బాదుడే బాదుడు.. మరోసారి పెట్రోల్ ధరల పెంపు
బాదుడే బాదుడు.. మరోసారి పెట్రోల్ ధరల పెంపు | చమురు కంపెనీలు వినియోగదారులను బాదేస్తున్నాయి. మంగళవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. మేలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు 17వ సారి ధరలు పైకి కదిలాయి.

న్యూఢిల్లీ : చమురు కంపెనీలు వినియోగదారులను బాదేస్తున్నాయి. మంగళవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. తాజాగా పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్ 23 పైసలు పెంచాయి. తాజాగా పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.49, లీటర్ డీజిల్ రూ.85.38కు పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ఇంధన ధరలు చేరాయి. మేలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు 17వ సారి ధరలు పైకి కదిలాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.101కి చేరువైంది. మరో వైపు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.105.52కు చేరగా, డీజిల్ ధర లీటరుకు ధర రూ.98.32 పలుకుతోంది. మరో వైపు హైదరాబాద్‌లో ధర రూ.100కు చేరువైంది. ప్రస్తుతం పెట్రోల్ రూ.98.20.. డీజిల్ రూ.93.08కు పెరిగాయి. ఇదిలా ఉండగా.. ముడి చమురు ధరలు సోమవారం పెరగ్గా బ్యారెల్ 70 డాలర్లకు.. బ్రెంట్ 0.5 శాతం పెరిగి బ్యారెల్ 69.79 డాలర్లకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు..
ముంబైలో పెట్రోల్ రూ.100.47.. డీజిల్ రూ.92.69
ఢిల్లీలో పెట్రోల్ రూ.94.49.. డీజిల్ రూ.85.38
చెన్నైలో పెట్రోల్ రూ.95.99.. డీజిల్ రూ.90.12
కోల్‌కతాలో పెట్రోల్ రూ.94.50.. డీజిల్ రూ.88.23
బెంగళూరులో పెట్రోల్ రూ.97.64.. డీజిల్ రూ.90.51
అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.91.48.. డీజిల్ రూ.91.93
భోపాల్‌లో పెట్రోల్ రూ.102.61.. డీజిల్ రూ.93.89
జైపూర్‌లో పెట్రోల్ రూ.101.02.. డీజిల్ రూ.94.19
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.98.20.. డీజిల్ రూ.93.08
ఇవి కూడా చదవండి..
ఈ నెల 9 వరకు యాదాద్రిలో దర్శనాల నిలిపివేత
ఈ- మెయిల్ హ్యాక్ చేసి.. స్నేహితుడిగా నమ్మించి
12-15 ఏళ్ల వారికి ‘ఫైజర్’ టీకాకు జపాన్ ఓకే..
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న నవోమి ఒసాకా
తెలంగాణలో నేటి నుంచి బ్యాంకుల పనివేళల మార్పు
దేశంలో 21.58 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ
ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత
భారత ప్రయాణికులపై నిషేధం పొడగించిన ఫిలిప్పీన్స్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
Dasara Posters | టాలీవుడ్లో పండగ జోష్.. దసరా కానుకగా సందడి చేసిన కొత్త సినిమాల పోస్టర్లు చూశారా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

