దేశంలో 21.58 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో 21.58 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ | దేశంలో ఇప్పటి వరకు 21.58 కోట్ల వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. 18-44 ఏళ్లలోపు సంవత్సరాలున్న వారు 12,23,596 మంది మొదటి మోతాదు, 13,402 మంది రెండో మోతాదు అందుకున్నారని పేర్కొంది.

న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటి వరకు 21.58 కోట్ల వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఒకే రోజు 18-44 ఏళ్లలోపు సంవత్సరాలున్న వారు 12,23,596 మంది మొదటి మోతాదు, 13,402 మంది రెండో మోతాదు అందుకున్నారని పేర్కొంది. మూడో దశ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైన నాటి నుంచి దేశవ్యాప్తంగా 2,02,10,889 మందికి వారి మొదటి, 23,491 మందికి రెండో మోతాదు వేసినట్లు పేర్కొంది. బిహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో పది లక్షలకుపైగా లబ్ధిదారులకు మొదటి మోతాదు అందిందని చెప్పింది.
దేశంలో నిర్వహిస్తున్న వ్యాక్సిన్ డ్రైవ్ సోమవారం రాత్రి అందిన వివరాల మేరకు 21,58,18,547 డోసులు వేసినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. టీకా డ్రైవ్ సోమవారం నాటికి 136వ రోజుకు చేరుకోగా.. ఒకే రోజు 25,52,501 వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో 22,75,324 మంది లబ్ధిదారులకు మొదటి మోతాదు.. మరో 2,77,177 మందికి సెకండ్ డోస్ వేసినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
ఈ నెల 9 వరకు యాదాద్రిలో దర్శనాల నిలిపివేత
ఈ- మెయిల్ హ్యాక్ చేసి.. స్నేహితుడిగా నమ్మించి
12-15 ఏళ్ల వారికి ‘ఫైజర్’ టీకాకు జపాన్ ఓకే..
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న నవోమి ఒసాకా
తెలంగాణలో నేటి నుంచి బ్యాంకుల పనివేళల మార్పు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

