మాగనూరు : కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress ) ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ. 6 వేలు పింఛన్ (Pensions) ఇవ్వాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘం మండల అధ్యక్షులు బాబు కోరారు. ఈ మేరకు శనివారం తహసీల్దార్ సురేష్ కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడిచినా దివ్యాంగులకు రూ. 6వేలు పెన్షన్ పెంచుతామని హామీ ఇప్పటివరకు నెరవేర లేదని ఆరోపించారు.
ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న దివ్యాంగులకు ఇప్పటివరకు కొత్త పింఛన్లు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న పింఛన్లు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి రవికుమార్, సభ్యులు లంగటి అబ్బయ్య, సగరం నరసింహులు, ఈడిగి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.