చేవెళ్లటౌన్, జనవరి 10 : సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉం టూ చదువుకునే విద్యార్థులతోపాటు పలువురు తమ స్వగ్రామాల బాట పట్టారు. శనివారం ఉదయం నుంచే చేవెళ్ల బస్టాండ్ జనంతో కిటకిటలాడింది. పండుగ రద్దీ ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సరిపడా బస్సులను నడ పకపోవడంతో ప్రయాణికులు అక్కడే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.

అంతేకాకుండా వచ్చిన అరకొర బస్సులు కూడా ప్రయాణికులకు సరిపోకపోవడంతో సీట్ల కోసం మహిళలు, పురుషులు గొడవలకు దిగారు. కొందరు సీట్లు దొరక్కపోవడంతో కిటికీల నుంచి బస్సు లు ఎక్కి అవస్థలు పడ్డారు. సరిపడా బస్సుల్లేకపోవడంతో ఉన్న బస్సుల్లోనే ప్రయాణికులు కెపాసిటీకి మించి అవస్థలు పడుతూ ప్రయాణించారు. ప్రభుత్వం పండుగ నేపథ్యంలో బస్సుల సంఖ్యను పెంచాలని పలువురు డిమాండ్ చేశారు.