అరకొర బస్సులు తప్పని తిప్పలు
సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉం టూ చదువుకునే విద్యార్థులతోపాటు పలువురు తమ స్వగ్రామాల బాట పట్టారు. శనివారం ఉదయం నుంచే చేవెళ్ల బస్టాండ్ జనంతో కిటకిటలాడింది. పండుగ రద్దీ ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సరిపడా బస్సులను నడ పకపోవడంతో ప్రయాణికులు అక్కడే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.
- సంక్రాంతిని పురస్కరించుకుని స్వగ్రామాలకు తరలిన జనం
- సరిపడా బస్సుల్లేక ప్రయాణికుల అవస్థలు
- సీట్ల కోసం కిటికీల్లోంచి దూరుతూ..
చేవెళ్లటౌన్, జనవరి 10 : సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉం టూ చదువుకునే విద్యార్థులతోపాటు పలువురు తమ స్వగ్రామాల బాట పట్టారు. శనివారం ఉదయం నుంచే చేవెళ్ల బస్టాండ్ జనంతో కిటకిటలాడింది. పండుగ రద్దీ ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సరిపడా బస్సులను నడ పకపోవడంతో ప్రయాణికులు అక్కడే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.

అంతేకాకుండా వచ్చిన అరకొర బస్సులు కూడా ప్రయాణికులకు సరిపోకపోవడంతో సీట్ల కోసం మహిళలు, పురుషులు గొడవలకు దిగారు. కొందరు సీట్లు దొరక్కపోవడంతో కిటికీల నుంచి బస్సు లు ఎక్కి అవస్థలు పడ్డారు. సరిపడా బస్సుల్లేకపోవడంతో ఉన్న బస్సుల్లోనే ప్రయాణికులు కెపాసిటీకి మించి అవస్థలు పడుతూ ప్రయాణించారు. ప్రభుత్వం పండుగ నేపథ్యంలో బస్సుల సంఖ్యను పెంచాలని పలువురు డిమాండ్ చేశారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

