హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): కృత్రిమ మేధస్సు(ఏఐ) వినిమయంలో గోప్యత, నీతికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆ దిశగా ఆర్ అండ్ డీపై ప్రత్యేక దృష్టి సారించాలని టెక్ కంపెనీలను ఆయన కోరారు. శనివారం బిట్స్ పిలానీ-హైదరాబాద్ క్యాంపస్లో నిర్వహించిన ‘బిట్స్ అల్యుమ్ని అసోసియేషన్ గ్లోబల్ మీట్ 2026’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు సేల్, స్పీడ్, వాల్యుయేషన్ ప్రాతిపదికన కంపెనీల సక్సెస్ నిర్ణయించబడేదని, కానీ ఇప్పుడు ఆరిటెక్చర్, డాటా ఓనర్ షిప్, డిసిషన్ స్పీడ్, నమ్మకంపైనే వాటి మనుగడ ఆధారపడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో కేవలం కోడింగ్ తెలిసిన వారి కంటే, సమస్య మూలాలను గుర్తించి పరిషరించగల క్రియేటివ్ థింకర్స్కే జాబ్ మారెట్లో డిమాండ్ ఉంటుందన్నారు.
ఏఐ ఫలితాలు వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లోని గ్రామీణ సమస్యలకు పరిషారం చూపేలా పరిశోధనలు జరుగాలని, అప్పుడే టెక్నాలజీ ఫలాలు సామాన్యులకు కూడా అందుతాయన్నారు. ఏఐ, ఇన్నోవేషన్, అకడమిక్ రీసెర్చ్ వంటి అంశాల్లో బిట్స్ పిలానీతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. టెక్నాలజీ కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, దేశ సేవకు ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. ఇతర దేశాలు ప్రైవేట్ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తే, భారత్ మాత్రం ఆధార్, యూపీఐ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ప్రపంచానికి దిక్సూచిగా నిలిచిందన్నారు.