నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ( Narnoor) , గాదిగూడ ( Gadiguda ) మండలంలో సోమవారం భారీ వర్షం కురిసింది. నార్నూర్ నుంచి గాదిగూడ వెళ్లే ప్రధాన రహదారి ఖడ్కి, లోకరికే, ధాబాకే కల్వర్టులపై వరద ప్రవాహంతో ప్రయాణికులు, వాహన చోదకులు వరద నీరు తగ్గే వరకు నిరీక్షించాల్సి వచ్చింది. వాగులు వంకలు జలమయ్య మయ్యాయి.
పంట పొలాలలో భారీ వర్షపు నీరు చేరడంతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షంతో ప్రజలు బయటకు రాలేకపోయారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ( People Alert ) ఉండాలని రెవెన్యూ, పోలీసుల శాఖల అధికారులు కోరారు. గడిచిన 24 గంటల్లో ఇంద్రవెల్లిలో46.4 మి.మీ , ఉట్నూర్‌లో 48.2 మి. మీ, నార్నూర్‌లో 40.0 మి.మీ, గాదిగూడలో 52.88 మి.మీ వర్షపాతం నమోదయింది.