Telangana | ఇటీవల ఆర్మూర్ నవసిద్ధుల గుట్ట, యాదగిరిగుట్ట నర్సింహస్వామి దర్శనానికి బస్సులో పోయిన మాందాపూర్ గ్రామస్తులు తెలంగాణ అభివృద్ధి, ఉమ్మడి పాలనలో కష్టాల గురించి చేసుకున్న సంభాషణ వారి మాటల్లోనే…
మా సర్పంచ్ సులోచనమ్మ, ఆమె భర్త రంపె గంగాధర్ కాక కొబ్బరికాయ కొట్టంగనె బస్సు బయల్దేరింది. అంతకుముందు మావూరి బీఆర్ఎస్ అధ్యక్షుడు, పెదకాపు సత్యనారాయణ కాక ‘జై తెలంగాణ, జై కేసీఆర్, జీవనన్న నాయకత్వం వర్ధిల్లాలి’ అని నినాదాలియ్యంగనె జై కొట్టుకుంట అందరూ బస్సెక్కిండ్రు.
గౌరవ్వ: నన్ను మా బాపు కూడా ఏ యాత్రలకు తిప్పకపాయే. జీవన్‌రెడ్డి పుణ్యాన యాదగిరిగుట్ట సూడవడ్తి.. అయ్యా యాదగిరి నర్సిమ్మసామీ.. మల్లా కేసీఆరే రానీ.. నాకు ఇల్లు లేదు. మల్లా ఆయన్నే గెలిత్తే గృహలక్ష్మి పైసలతో నా పిల్లలకింత గూడు నిలవడ్తది. (అందరికీ వినిపించేలా మొక్కుతుంటే…)
గంగయ్య: గంతేనా గౌరమ్మా?!.. నీ పొలంకు ఫిరీ కరెంటు, లాగోడికి పైసలు (రైతుబంధు), మీ అయ్యకు ఇకలాంగుల పింఛను, మీ అవ్వకు ముసలోల్ల పింఛను, నీకు బీడీల పింఛను.. గివన్నీ ఎటువోయినయి? అవన్నీ శెప్పవేం పిల్లా?!
గౌరవ్వ: అందుకే కద ముసలోడా.. మల్లా కేసీఆరే రావాలని మొక్కుతున్నా!
గంగయ్య తాత: ఆ గదే అంటున్నా మరి ఎందుకంటే, అప్పట్ల మేము టీడీపీల తిరిగినప్పుడు గీ భూములల్ల మక్కశేన్లు ఉంటుండె. నీల్లు లేక గీ షేన్లన్నీ ఎండిపోతుండె. గంతటి కరువున్నదా ఇప్పుడు?!
(గంగయ్య చెప్తుంటే మా అమ్మ, గంగమణి చిన్నవ్వ కండ్లు మల్లోసారి చెమర్చినయ్. అంతకుముందు అంకాపూర్ తోటలను చూసి మా ఇద్దరు అవ్వల కండ్ల ముంగట గతం గిర్రున తిరిగింది. మా బాపు, చినబాపు ఆర్మూరు పట్టెకు వలస పోయిన రోజులు తల్సుకొని వాల్ల కండ్లల్ల నీల్లు సుడులు తిరిగినయ్)
శిన్నర్సయ్య: బోర్లకాడ కరెంటు డబ్బాలు పీక్కపోయిందిగూడా గప్పుడేగాదా
లింగరెడ్డి: కాంగ్రెసోల్లదేమన్న కమ్మటి పాలన్నా? దొంగ కరెంటు, ముష్టి డబ్బు రూపాయల పింఛిని (అని అంతెత్తు లేసిండు)
శీను: ఇప్పుడు మల్లా అస్తుండ్రుగదనే. గ్యారెంటీలు, వారంటీలు అని చెప్పుకుంటా. అప్పట్ల పారిందే పారుడు, ఆ కొనాకు గనుమ అందనే అందది.. పాములుంటయో తెలది, తేళ్లుంటయో తెలది.. శీకట్లవొయ్ కరెంటు డబ్బాల శేతువెడ్తే ఏ వైరు తలిగి పాణంబోతదో తెలది.. కొత్తగ లగ్గమైనోడి పానమంత ఇంటికాడ, పండుడేమో బోర్లకాడ.
(కాంగ్రెస్ హయాంల కరెంటు కష్టాల గురించి శీను మామ చెప్పుకుంటూ పొట్టుపొట్టు తిట్టుడువెడుతుంటే బస్సులున్నోల్లందరి కడుపులు చెక్కలైనయ్)
పల్లక్క: ఔ మరి ఇప్పుడున్న సౌలత్లు ముందు యాడుండె? ఊల్లె ఓలన్న సస్తే అలుగుల్ల మోకాల్లమంటి నీల్లల్లకెల్లి దాటుకుంటా కట్టకొమ్ముకు పెడ్తుంటిమి. ఇప్పుడు మంచిగ శ్మశానవాటిక కట్టిచ్చిండ్రు.
సత్యనారాయణ: అంతేకాదు, తెలంగాణ అచ్చినంకనే మన ఊరి పంచాదాఫీసు మనది మనకైంది. ఇంటింటికి నల్లా నీల్లస్తున్నయ్. సీసీరోడ్లు పోసుకున్నం. లక్నపురం మీదికెల్లి బ్యాంకుకు పోడానికి మంచిగ డాంబర్ (బీటీ) రోడ్డుపడ్డది. కొత్తగ ఇస్కూల్ల పిల్లలకు టిఫిన్ (సీఎం బ్రేక్‌ఫాస్ట్) కూడా ఫ్రీగా పెడ్తున్నరు. గింత మంచి సౌలత్లు ఇంతకు ముందెప్పుడైనా సూశినమా? (కేసీఆర్ సర్కారు చేసిన డెవలప్మెంటునంతా సదువుతుండంగనే…)
మహేశ్: అందుకే అందరం ఒకటే మాట మీద ఉండాలే.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటేనే మనకు మేలు.. మల్లా జీవన్‌రెడ్డే రావాలని మొక్కుకోర్రి, దిగుర్రిగ అచ్చింది యాద్గిరిగుట్ట
(అందరూ బస్సు దిగి యాదాద్రి నర్సన్న ఆలయం దిక్కు నడిశిండ్రు).