Pastors Association |ఓదెల, ఆగస్టు 4 : పెద్దపల్లి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నట్టు తెలిపారు. యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీ అధ్యక్షుడిగా బొంగాని సదయ్య గౌడ్ (గోపరపల్లి) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అలాగే వైస్ ప్రెసిడెంట్ సురేష్ (ఎలిగేడు), ప్రధాన కార్యదర్శిగా స్టాలిన్ (కొలనూరు), సహాయ కార్యదర్శిగా ఏలియా(కాసులపల్లి). కోశాధికారిగా ప్రకాష్ (కాల్వ శ్రీరాంపూర్), కమిటీ మెంబర్స్ గా ప్రేమ్ కుమార్(వడ్కాపూర్), రాజు(దుబ్బపల్లి) లను ఎన్నుకున్నారు. తమ ఎన్నికకు సహకరించిన పాస్టర్స్ అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.