మక్తల్ : ప్రజా పంపిణీకి (PDS rice) సంబంధించిన బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేశామని నర్వ ఎస్సై కుర్మయ్య( SI Kurmaiah) తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గంలోని నర్వ మండల పరిధి పెద్ద కడుమూరు గ్రామంలో ఎరుకలి నరసింహ ఇంట్లో ప్రజా పంపిణీకి సంబంధించిన బియ్యం నిల్వ ఉన్నాయని పక్కా సమాచారం వచ్చిందన్నారు.
ఈ మేరకు మంగళవారం రాత్రి పోలీస్ సిబ్బందితో వెళ్లి తనిఖీలు నిర్వహించగా అతడి ఇంట్లో 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి డిప్యూటీ తాసిల్దార్ కు సమాచారం అందించామని పేర్కొన్నారు. డీటీ పంచనామా నిర్వహించి నరసింహపై కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.