Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవలే హరిహరవీరమల్లు పార్టు 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలపై తన ఫోకస్ అంతా పెట్టాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడం పక్కా అని ధీమాగా ఎదురుచూస్తున్నారు అభిమానులు, ఫాలోవర్లు. వీటిలో సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఓజీ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
పవన్ కల్యాణ్ హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వంలో టైటిల్ రోల్ పోషిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించి మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఓజీ విడుదల అయ్యే వరకు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టొద్దని ఫిక్స్ అయ్యారని ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త రౌండప్ చేస్తోంది.
తాజా టాక్ ప్రకారం ఓజీ విడుదలయ్యాకే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ షురూ కానున్నాయి. అంతేకాదు ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్‌ను అక్టోబర్ తొలి లేదా రెండో వారంలోలాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ లెక్కన ఓజీ ఒక్కసారి థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ మేనియా నుంచి అభిమానులు బయట పడ్డాక ఉస్తాద్ భగత్ సింగ్ సందడి మొదలు కానుందన్నమాట. ఏదైమైనా పవన్ కల్యాణ్ టీం అభిమానులకు గ్యాప్ లేకుండా వినోదాన్ని అందించాలని గట్టిగానే ఫిక్సయినట్టు తాజా వార్తలు చెప్పకనే చెబుతున్నాయి.
భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ ఉస్తాద్ భగత్ సింగ్‌లో తనదైన మ్యానరిజంతో సాగుతున్న పవన్ కల్యాణ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Mega Actors | ఒకే చోట మెగా హీరోలు.. వైరలవుతున్న ఫొటో
Film Federation | చర్చలు ఫలించకపోతే.. షూటింగ్‌లు పూర్తిగా నిలిపివేస్తాం: ఫిల్మ్ ఫెడరేషన్