Mega Actors | మెగా హీరోలంతా ఒకేచోట కలిశారు. అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ (Ram Charan)తో పాటు యువ నటులు
వరుణ్‌తేజ్ (Varun Tej), సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) ముగ్గురు ఒకే చోట కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్‌లో వ్యాయామం అనంతరం ముగ్గురు కలిసి దిగిని ఫొటోను వరుణ్ తేజ్ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో అంతటా వైరల్‌గా మారింది.
సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తుండగా.. సాయిధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీతో ‘కొరియన్ కనకరాజు’ అనే కామెడీ చిత్రం చేస్తున్నాడు.
🦁 @AlwaysRamCharan 🔥
The #PEDDI BEAST with @IAmVarunTej @IamSaiDharamTej ! pic.twitter.com/4WPYaxeFlZ
— Trends RamCharan ™ (@TweetRamCharan) August 10, 2025