Film Federation | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వేతనాల పెంపు వివాదంపై తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, నిర్మాతల మధ్య చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం జరగబోయే చర్చలు కూడా ఫలించకపోతే, ప్రస్తుతం నుంచి జరిగే అన్ని రకాల షూటింగ్లను పూర్తిగా నిలిపివేస్తామని ఫెడరేషన్ ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలకు రెండు మూడు రోజులు షూటింగ్లకు సమయం మిస్తామని. ఆ తర్వాత షెడ్యూల్ ఉన్నవారితో కూడా మాట్లాడి షూటింగ్లు నిలిపివేస్తామంటూ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. గత మూడు సంవత్సరాలుగా వేతనాలను సవరించలేదని, ఈ కారణంగా తమ కార్మికులు జీవన వ్యయానికి ఇబ్బందులు పడుతున్నారని ఫెడరేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, తమ వేతనాల్లో 30% పెంపును కోరుతున్నారు. అయితే, నిర్మాతలు ఈ ప్రతిపాదనను అంగీకరించడానికి సుముఖత చూపడం లేదని ఫెడరేషన్ ఆరోపించింది.