Vijay Devarakonda | కింగ్డమ్ సినిమాతో ఇటీవలే హిట్‌ని అందుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో దర్శకుడు హరీశ్ శంకర్‌తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై విజయ్ దేవరకొండ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని, విజయ్ తన కెరీర్‌ను నాశనం చేసుకోవద్దంటూ విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
దర్శకుడు హరీశ్ శంకర్‌కి గబ్బర్ సింగ్ తర్వాత చెప్పుకోదగిన స్థాయిలో పెద్ద హిట్ రాలేదన్న విషయం తెలిసిందే. సాయి ధరమ్ తేజ్‌తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా విజయం అందుకున్న కూడా హరీశ్‌కి పెద్దగా పేరు రాలేదు. ఇక రీసెంట్గా అతడి దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా అయితే రవితేజ కెరీర్‌తో పాటు టాలీవుడ్ టాప్ టెన్ డిజాస్టార్లలో ఒకటిగా నిలిచింది. దీంతో హరీశ్ శంకర్ ఎవరితో సినిమా అనౌన్స్ చేస్తున్నాడు అంటే చాలు ఆ సినిమా డిజాస్టార్ అవుతుంది అనే టాక్ ముందే వస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రం కూడా సనాతన ధర్మం అనే కాన్సెప్ట్‌తో రాబోతుండడంతో ఈ చిత్రం కూడా పవన్ కెరీర్లో మరో అట్టర్ ఫ్లాప్‌ని నమోదు చేస్తుందని నెటిజన్లు తెలుపుతున్నారు. ఇదిలావుంటే హరీశ్ శంకర్ త్వరలోనే విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వస్తుండటంతో రౌడీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విజయ్ తన కెరీర్‌ని తనే నాశనం చేసుకున్న ఇంత బాధపడం కానీ ఇలా చేయకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
nuv cinemalu aapesina intha feel avvanu tbh @TheDeverakonda 😭😭😭😭 https://t.co/H7ZzXBAmUW
— blair ‘ tsitp🍸 (@emailsicxntsend) August 10, 2025
@TheDeverakonda Bro genuine gaa cheptunna @harish2you gaaritho matram cinema tiyyaku please 💔 ..!!
Nee Range ki evaraina top director tho tiyyaalsindi poyi Eee remake lu kuda proper gaa cheyleni director tho avsarama .!?— నిఖిల్ 🦨 (@nikhilforntr) August 10, 2025
Ippatiki Ni Mida Nammakam Undi @TheDeverakonda AnnA Maaku,Kaani E Movie OK chestey Adi kooda Pothundi,NO cheppu please 🥺
— Therajamohan (@therajamohan) August 10, 2025