Pawan Kalyan | హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, మూసీ నది వరదలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజలకు అండగా ఉండే సమయం ఇదేనంటూ, తెలంగాణ జనసేన కార్యకర్తలు బాధితులకు సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరంలోనూ, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మూసీ వరదతో ఎం.జి. బస్టాండ్, పరిసరాలు నీట మునిగాయని తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు మొదలుపెట్టాయి.
ప్రభుత్వ సూచనలను, వాతావరణ హెచ్చరికలను ప్రజలు అనుసరించాలని సూచిస్తున్నాను. వరద బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అవసరమైన ఆహార అందించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని జనసేన తెలంగాణ నాయకులు, శ్రేణులకు ఇప్పటికే దిశానిర్దేశం చేయడమైనది.ఈ క్రమంలో డిప్యూటీ సీఎంవో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ఖాతాలో శనివారం ఉదయం ఓ పోస్టు పెట్టారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల జలాశయాల్లో వరద నీరు పెరిగింది. అధికారులు గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉధృతి పెరిగింది. 35 వేల క్యూసెక్కుల వరద నీరు నదిలోకి ప్రవహించడంతో ఎంజీబీఎస్ బస్టాండ్ నీటమునిగింది
చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ వంతెనలపై నీరు ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొన్ని కాలనీల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ సామాగ్రి కొట్టుకుపోయింది. ఇక ప్రయాణికులను ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తాత్కాలిక ఆశ్రయ శిబిరాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నారు. వంతెనలపై రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా, పవన్ కల్యాణ్ గత కొద్దిరోజులుగా వైరల్ ఫీవర్‌తో ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నారు. గత నాలుగు రోజులుగా బెడ్‌కు పరిమితం అయ్యారు. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం సెప్టెంబర్ 25న విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.