Ustaad Bhagat Singh | ఇటీవలే హరిహరవీరమల్లు పార్టు 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ప్రస్తుతం తన ఫోకస్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలపై పెట్టాడు. హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వంలో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. రాశీఖన్నా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఇవాళ హైదరాబాద్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్లో పవన్ కల్యాణ్, రాశీఖన్నా జాయిన్ అయ్యారు. పవన్ కల్యాణ్, రాశీఖన్నాపై వచ్చే సాంగ్‌ను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. కొరియోగ్రఫర్ దినేశ్ మాస్టర్ నేతృత్వంలో సాంగ్ షూట్ కొనసాగుతుంది. ఈ షెడ్యూల్ కొన్ని రోజులపాటు కొనసాగనుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే విడుదల చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది.
భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ ఉస్తాద్ భగత్ సింగ్‌లో తనదైన మ్యానరిజంతో సాగుతున్న పవన్ కల్యాణ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Sai Pallavi | SIIMA Awards వేడుకలో పింక్ సారీలో మెరిసిన సాయిపల్లవి.. పిక్స్ వైరల్