కోస్గి(దౌల్తాబాద్), జూలై 15 : సర్ ప్రక్రియలో అర్హుల ఓట్లు తొలగిపోకుండా బీఆర్ఎస్ శ్రేణులు, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సూచించారు. బుధవారం వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోకఫసలాబాద్లో పార్టీ శ్రేణులు, బీఎల్ఏలకు సర్పై అవగాహన కల్పించారు. ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ప్రతి ఒక్కరూ వాటిని పూర్తి వివరాలతో నింపి సంబంధిత బీఎల్వోలకు సమర్పించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తథ్యమని, మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని ధీమా వ్యక్తంచేశారు.