హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను అమలు చేయకపోవడంపై తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల జేఏసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రీమియం కట్ చేసినా ఈ నెల 15లోగా కార్డులివ్వకపోవడం అత్యంత దారుణమని జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. స్కీమ్ ప్రారంభమయ్యే వరకు ప్రీమియం కట్ చేయడాన్ని నిలుపుదల చేయాలని, కట్‌చేసిన ప్రీమియాన్ని తిరిగి వాపస్ చేయాలని సీఎస్ సంజయ్‌జాజును కలిసి వినతిపత్రం సమర్పించారు.
పిల్లల చదువులకు తల్లిదండ్రుల ‘ప్రతిజ్ఞ’
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : సర్కార్ బడుల్లోని తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచడంపై పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పిల్లల చదువులకు అండగా ఉం టామని తల్లిదండ్రుల చేత ప్రతిజ్ఞ చే యించనున్నది. ఈ నెల 18న నిర్వహిం చే పేరెంట్ టీచర్ సమావేశాల్లో తల్లిదండ్రుల చేత ప్రతిజ్ఞ చేయించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సూచించారు. సమావేశం కోసం మొత్తం 6 ప్రామిస్(హామీలను) విద్యాశాఖ సి ద్ధం చేసింది. తల్లిదండ్రులు ఏదో ఒక హా మీని ఎంచుకుని బహిరంగంగా చదవడ మే కాకుండా, రాబోయే నెల రోజులపా టు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉం టుంది. ప్రతిజ్ఞకు సంబంధించిన రిజిస్టర్లో సంతకం చేయాల్సి ఉంటుంది.