మాడల్ స్కూల్లో విద్యార్థి మృతి
పెద్దపల్లి జిల్లాలో ఓ మాడల్ స్కూల్ విద్యార్థి బావిలో పడి ప్రా ణాలు కోల్పోయాడు. వివరాలు.. రామగుండం పోలీస్టేషన్ పరిధిలోని ఎన్టీపీసీ ఖాజిపల్లికి చెందిన సాత్విక్ (13) లింగాపూర్ గ్రామ సమీపంలోని మాడల్ స్కూల్ల్లో 8వ తరగతి చదువుతున్నాడు.
- వ్యవసాయ బావిలో పడిన బాల్‌ను తీసేందుకు యత్నించి దుర్మరణం
- ప్రిన్సిపాల్, పీఈటీ సస్పెన్షన్
జ్యోతినగర్ (రామగుండం), జూలై 15 : పెద్దపల్లి జిల్లాలో ఓ మాడల్ స్కూల్ విద్యార్థి బావిలో పడి ప్రా ణాలు కోల్పోయాడు. వివరాలు.. రామగుండం పోలీస్టేషన్ పరిధిలోని ఎన్టీపీసీ ఖాజిపల్లికి చెందిన సాత్విక్ (13) లింగాపూర్ గ్రామ సమీపంలోని మాడల్ స్కూల్ల్లో 8వ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం పూట స్కూల్ ఆవరణలో తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా బాల్ ప్రహరీ అవతల వ్యవసాయ బావిలో పడింది. బాల్‌ను తీసేందుకు సాత్విక్‌తోపాటు మరో ముగ్గురు విద్యార్థులు కలిసి ఒకరినొకరు పట్టుకొని బావిలోకి దిగే యత్నం చేశారు. ఈక్రమంలో సాత్విక్‌తోపాటు మరో విద్యార్థి బావిలో పడిపోయారు. స్వాతిక్ నీటిలో మునిగి అక్కడికక్కడే మృతిచెందగా, మరో విద్యార్థి దరిని పట్టుకున్నాడు. ఈ విషయాన్ని వెంటనే పీఈటీకి తెలుపగా, అక్కడికి వెళ్లి ఆ విద్యార్థిని రక్షించాడు. లింగాపూర్ గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశా రు. కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. పీఈటీ నిర్లక్ష్య ధోరణితోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, పెద్దపల్లి ఆర్డీవో గం గయ్య, రామగుండం ఎస్సై సంధ్యారాణి వారితో మాట్లాడారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ అధికారులతో మాట్లాడి స్కూల్ ప్రిన్సిపాల్ సదానందం, పీఈటీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఎక్స్‌గ్రేసియా చెల్లింపునకు ఆర్డీవో, గోదావరిఖని ఏసీపీ, రామగుండం సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

