హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఫలక్నుమా ప్యాలెస్లో బ్రిక్స్ దేశాల మంత్రుల బృందానికి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఏర్పాటుచేసిన విందుకు బుధవారం సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు. దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, చైనా, రష్యా, ఇరాన్, ఇథియోపియా, యూఏఈ, బ్రెజిల్ దేశాల మంత్రులను సీఎం మర్యాదపూర్వంగా కలిశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సీఎం ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీధర్, డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు.