Passenger vehicles | న్యూఢిల్లీ, జనవరి 1: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. గడిచిన సంవత్సరానికిగాను దేశీయంగా 43 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. వాహన దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, టయోటా కిర్లోస్కర్ మోటర్, కియాలు అత్యధిక వార్షిక వృద్ధిని నమోదు చేసుకోవడం ఇందుకు కలిసొచ్చింది. పీవీల విక్రయాలు దూసుకోవడానికి ప్రధానంగా గ్రామీణ ప్రాంత మార్కెట్ చాలా కీలక పాత్ర పోషించిందని, 2023లో అమ్ముడైన 41.1 లక్షల యూనిట్లతో పోలిస్తే రెండంకెల వృద్ధి నమోదైందని మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ తెలిపారు. గతేడాదిలో మారుతి అత్యధికంగా 17,90,977 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. చిన్న స్థాయి నగరాలు, పట్టణాల్లో సైతం రిటైల్ అవుట్లెట్లను తెరవడానికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని,
గత ఏడాది కంపెనీల వాహన విక్రయాలు
2024లో 43 లక్షల యూనిట్ల అమ్మకాలు