న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు స్టార్ట్ అయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభలోనూ కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఓపెన్ మైండ్‌తో అన్ని అంశాలను చర్చించాలని మోదీ సూచించారు. ఇది చాలా కీలకమైన సమయమని, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ ఇది అని, రాబోయే 15వ ఆగస్టుకు ప్రత్యేకద ఉందని, మరో 25 ఏళ్లలో వందవ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటామని, ఈ నేపథ్యంలో బలమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశాలు ఫలప్రదం కావాలంటే ఎంపీలందరూ చర్చల్లో పాల్గొనాలన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకు జరగనున్నాయి.