Papikondalu tour : రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు అధికారులు ఒక చేదువార్త చెప్పారు. గోదావరి నదిలో అత్యంత ఆదరణ పొందిన ‘పాపికొండలు విహారయాత్ర’ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జలవనరుల శాఖ ప్రకటించింది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురుస్తుండటంతో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాపికొండలు యాత్రను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వాతావరణ పరిస్థితులు మెరుగుపడి, పర్యావరణం అనుకూలించిన తర్వాతనే విహారయాత్రను పునరుద్ధరిస్తామని యంత్రాంగం వెల్లడించింది. యాత్ర పునఃప్రారంభానికి సంబంధించిన తదుపరి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని, అప్పటివరకు పర్యాటకులు అధికారులకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా నదీ ప్రవాహంలో ప్రమాదాలు జరగకుండా ముందుజాగ్రత్తగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.