Niloufer hospital | బిడ్డను తీసుకెళ్తమని గ్యారంటీ అయితే లేదు.. ఓ గర్భిణీ భర్త ఆవేదన.. వీడియో
Niloufer hospital | నిలోఫర్ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తీరుపై గర్భిణీ స్త్రీల కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గర్భిణీ కుటుంబసభ్యులు తాము వేరే ఆసుపత్రికి వెళ్తామని చెప్పినా, , అలా వెళ్లడానికి వీల్లేదని ఆస్పత్రి సిబ్బంది పంపడం లేదని చెబుతున్నారని వాపోయారు.
Niloufer hospital | నిలోఫర్ ఆసుపత్రి సిబ్బందిపై గర్భిణీ మహిళల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బెడ్స్ లేక గంటల తరబడి కుర్చీలపై పడిగాపులు గాస్తే ఆసుపత్రి సిబ్బంది కనీసం పట్టించుకోలేదని గర్భిణీలు ఆవేదన చెందుతున్నారు. గర్భిణీ కుటుంబసభ్యులు తాము వేరే ఆసుపత్రికి వెళ్తామని చెప్పినా, ఇక్కడ అడ్మిషన్ అయ్యారు, అలా వెళ్లడానికి వీల్లేదని ఆస్పత్రి సిబ్బంది పంపడం లేదని చెబుతున్నారని వాపోయారు. ఈ క్రమంలో నిలోఫర్ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తీరుపై గర్భిణీ స్త్రీల కుటుంబసభ్యులు నిరసన కూడా వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో నిలోఫర్ ఆసుపత్రి మెయింటెనెన్స్ చాలా దరిద్రంగా ఉందని ఓ గర్బిణీ తరపు కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన ఓ గర్భిణీ భర్త మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో బెడ్స్ లేకపోవడంతో గర్భిణులు, బాలింతలను నేలమీద పడుకోబెడుతున్నారని అన్నాడు. సమస్య ఉందని వచ్చాం.. ఇక్కడ బెడ్లు లేవు.. ఒక్క రోజుకే డిశ్చార్జ్ అని రాశారు. తెల్లారే వచ్చి మళ్లీ జాయిన్ చేసిన. మాకున్న సమస్యనేమో స్కానింగ్‌లో గ్రహణమొర్రి అని చెప్పిర్రు. మేం మెదక్ నుంచి వచ్చినం.. మమ్మల్ని సంగారెడ్డిలోని క్లినిక్ నుంచి ఇక్కడికి పంపించారన్నాడు.
డాక్టర్లు అందుబాటులో ఉండటం బతిలాడుకోవాల్సి వస్తుంది.. మేమొచ్చి వారం రోజులు అవుతుంది. ఏం చెప్తలేరు. మొన్న ఒక రోజు పంపించిర్రు. మళ్లీ పోయి వచ్చినం. డాక్టర్లను రోజూ అడుక్కోవాల్సి వస్తుంది నిలోఫర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చూసి బిడ్డ బతకడం కష్టమని మేము ఫిక్స్ అయ్యాం. నీలోఫర్‌కు వస్తే మన మనిషి దక్కాలి అనే పరిస్థితి తప్ప బిడ్డను అయితే తీసుకెళ్తమని గ్యారంటీ అయితే లేదు. ఈ వారం నుంచి తెలిసిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
నిలోఫర్ ఆసుపత్రి సిబ్బందిపై గర్భిణీ మహిళల కుటుంబసభ్యులు ఆగ్రహం
బెడ్స్ లేక గంటల తరబడి కుర్చీలపై పడిగాపులు గాస్తే ఆసుపత్రి సిబ్బంది కనీసం పట్టించుకోలేదని గర్భిణీలు ఆవేదన
గర్భిణీ కుటుంబసభ్యులు తాము వేరే ఆసుపత్రికి వెళ్తామని చెప్పినా, ఇక్కడ అడ్మిషన్ అయ్యారు, అలా వెళ్లడానికి… https://t.co/nk3E8PqnJO pic.twitter.com/WyABXnsp9o
— Telugu Scribe (@TeluguScribe) August 4, 2026
నిలోఫర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చూసి బిడ్డ బతకడం కష్టమని మేము ఫిక్స్ అయ్యాం
బెడ్స్ లేక గర్భిణులను నేల మీద పడుకోబెడుతున్నారు
డాక్టర్లు అందుబాటులో ఉంటలేరు.. ట్రీట్మెంట్ సరిగ్గా జరగడం లేదు
డాక్టర్లను రోజూ అడుక్కోవాల్సి వస్తుంది
– గర్భిణీ తరపు కుటుంబ సభ్యుల ఆవేదన https://t.co/1ZL9T116QJ pic.twitter.com/8DhhX5CgV4
— Telugu Scribe (@TeluguScribe) August 4, 2026
Read ALso :
Nizamabad | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి దోపిడీ
Gandhari | రామలక్ష్మణపల్లిలో అకాల వర్షానికి కొట్టుకుపోయిన వరి నాటు.. తీవ్ర నష్టంలో రైతులు
Odela | ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

