E20 Petrol | E20 పెట్రోల్ సందేహాలకు కేంద్రం స్పష్టత.. రోజుకు 12 సార్లు నాణ్యత పరీక్షలు
E20 Petrol | ఈ20 పెట్రోల్ నాణ్యత (E20 Petrol Quality) పై వస్తున్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) మంగళవారం స్పష్టతనిచ్చింది. దేశవ్యాప్తంగా ఇంధన నాణ్యతను చమురు మార్కెటింగ్ సంస్థలు (OMC) నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం 87 వేలకుపైగా పెట్రోల్ బంకుల్లో రోజుకు 8 నుంచి 12 సార్లు కలుషిత/కల్తీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
E20 Petrol : ఈ20 పెట్రోల్ నాణ్యత (E20 Petrol Quality) పై వస్తున్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) మంగళవారం స్పష్టతనిచ్చింది. దేశవ్యాప్తంగా ఇంధన నాణ్యతను చమురు మార్కెటింగ్ సంస్థలు (OMC) నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం 87 వేలకుపైగా పెట్రోల్ బంకుల్లో రోజుకు 8 నుంచి 12 సార్లు కలుషిత/కల్తీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
దేశంలో ఇప్పటివరకు క్లోరైడ్ కలుషితానికి సంబంధించిన రెండు ఘటనలు మాత్రమే గుర్తించినట్లు పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ రెండు పెట్రోల్ బంకుల్లో ఇంధన విక్రయాలను వెంటనే నిలిపివేసినట్లు పేర్కొన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రెండు వేలకుపైగా ఇంధన నమూనాలను క్లోరైడ్, సల్ఫైడ్ కలుషితానికి పరీక్షించినట్లు వెల్లడించింది. ఎక్కడైనా కలుషితం లేదా కల్తీ బయటపడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేసింది.
ఇంధన సరఫరా వ్యవస్థ మొత్తాన్ని ఓఎంసీలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించినట్లు తెలిపింది. ఈ20లో కలిపే ఇథనాల్ తప్పనిసరిగా బీఐఎస్ ఐఎస్ 15464 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని కేంద్రం తెలిపింది. ఇథనాల్ స్వచ్ఛత కనీసం 99.6 శాతం ఉండాలని పేర్కొన్నది. ప్రతి సరఫరాతోపాటు నాణ్యత ధ్రువీకరణ నివేదిక తప్పనిసరిగా ఉండాలని వెల్లడించింది. ఇథనాల్ నిల్వకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ప్రతి ట్యాంకర్‌ను స్వీకరించే ముందు పైభాగం, దిగువ భాగం నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. ప్రతి డెలివరీకి ముందు కూడా నాణ్యత తనిఖీలు తప్పనిసరిగా చేస్తున్నట్లు పేర్కొన్నది. 2024 జూలై నుంచి 2026 జూన్ వరకు నాణ్యత ప్రమాణాలు పాటించని 302 ట్యాంకర్లను తిరస్కరించినట్లు కేంద్రం వెల్లడించింది. వీటిలో దాదాపు 10,500 కిలోలీటర్ల ఇథనాల్ ఉన్నట్లు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

