కాబుల్, అక్టోబర్ 17: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్.. శుక్రవారం అఫ్ఘాన్‌పై వైమానిక బాంబు దాడులు చేసింది. ఇటీవల రెండు దేశాల మధ్య ఘర్షణ ఏర్పడిన క్రమంలో 48 గంటల పాటు కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది.
తాజాగా దానిని మరో 48 గంటల పాటు పొడిగించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అది జరిగిన కొద్ది గంటలకే పాకిస్థాన్ వాయు సేన డ్యూరాండ్ రేఖ వెంబడి ఉన్న ప్యాక్టికా ప్రావిన్స్‌లోని పలు జిల్లాలపై దాడులు చేసింది.