న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల సమయాల్లో కొందరు నకిలీ వైకల్య ధ్రువీకరణ పత్రాలతో లబ్ధి పొందుతుండటంపై కేంద్రం దృష్టి సారించింది. దీంతో వైకల్య ధ్రువీకరణ పత్రాల తనిఖీ విధానాలను కఠినతరం చేసింది.
అభ్యర్థులు దాఖలు చేసే వైకల్య ధ్రువీకరణ పత్రం, ప్రత్యేక వైకల్య ఐడీ కార్డును యూడీఐడీ జాతీయ పోర్టల్ ద్వారా ధ్రువీకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.