Pakistan breaks Ceasefire | కాల్పుల విమరణకు తూట్లు.. అఫ్గనిస్థాన్‌పై గగనతల దాడులకు పాల్పడిన పాక్..!
Pakistan breaks Ceasefire : ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ కాల్పుల విరమణ(Pakistan breaks Ceasefire)కు తూట్లు పొడిచింది. అఫ్గనిస్థాన్‌లోని మూడు రాష్ట్రాల్లో జనావాసాలే లక్ష్యంగా గగనతల దాడులకు పాల్పడింది.
Pakistan breaks Ceasefire : ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ కాల్పుల విరమణ(Pakistan breaks Ceasefire)కు తూట్లు పొడిచింది. అఫ్గనిస్థాన్‌లోని మూడు రాష్ట్రాల్లో జనావాసాలే లక్ష్యంగా గగనతల దాడులకు పాల్పడింది. ఇరుదేశాల మధ్య కుదిరిన రెండు రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది దాయాది దేశం. డ్యూరాండ్ లైన్(Durand Line) వెంబడి ఉన్న మూడు జిల్లాలపై పాక్ సైన్యం గగనతల దాడులకు తెగబడిందని శుక్రవారం తాలిబన్ సీనియర్ నేత ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్ (AFP)తో వెల్లడించారు. తాము పాక్ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు.
‘పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఇరుదేశాల సరిహద్దులోని పక్తికా (Paktika) ప్రావిన్స్‌లోని అర్గున్, బెర్మల్ జిల్లాలోని పలు ఇళ్లపై మూడు ప్రాంతాల్లో బాంబులతో దాడి చేసింది. ఈ చర్యకు అఫ్గనిస్థాన్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది’ అని ఆ నేత పేర్కొన్నాడు. అయితే.. పాక్ దాడిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించిన వివరాలను మాత్రం తాలిబన్ నాయకుడు వెల్లడించలేదు.
Pakistan just violated the ceasefire with by bombing Urgun, Paktika! Many women and children have been moved to the local hospital!@ObaidullaBaheer pic.twitter.com/NXNvQra7pB
— Insaf Marwat (@abakheli) October 17, 2025
ఇరుదేశాల నడుమ ఉద్రికత్తలను చర్చల ద్వారా తగ్గించుకునేందుకు రెండు దేశాల నాయకులు శనివారం ఖతార్‌లోని దోహాలో సమావేశం కానున్నారు. ఇప్పటికే పాక్ ప్రతినిదులు దోహా చేరుకున్నారు. అఫ్గన్ టీమ్ ఇంకా బయల్దేరాల్సి ఉంది. ఆలోపే పాక్ కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

