అంటాననారివో: జెన్-జీ తిరుగుబాటుతో అధికారం మారిన ద్వీప దేశం మడగాస్కర్ నూతన అధ్యక్షుడిగా కర్నల్ మైఖేల్ రాండ్రియానిరినా శుక్రవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
యువత నేతృత్వంలో జరిగిన నాటకీయ తిరుగుబాటులో అధికారాన్ని చేజెక్కించుకుని, మాజీ నాయకుడు ఆయండ్రీ రజోలినాను పదవీచ్యుతిడిని చేసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.